News January 17, 2026

బొజ్జన్న కొండ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన బౌద్ధ బిక్షువులు

image

అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో గల బొజ్జన్న కొండ వద్ద శుక్రవారం నిర్వహించిన బౌద్ద మేళాలో దేశ విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బౌద్ధ స్తూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేళాలో పాల్గొన్న వారికి బుద్ధుని పంచశీల సూక్తులను వివరించారు. ప్రపంచ శాంతికి బుద్ధుని శాంతి మార్గమే శరణ్యమని సూచించారు.

Similar News

News February 14, 2026

BHPL: గవర్నమెంట్ జాబ్‌కు రాజీనామా.. చివరికి ఓటమి!

image

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా హరీష్ పోటీ చేసి ఓటమి చెందారు. హరీష్ పంచాయతీ శాఖలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కాంట్రాక్టు ఉద్యోగంలో పనిచేసేవాడు. మూడున్నర సంవత్సరాల పాటు ఉద్యోగంలో పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. దీంతో హరీష్‌కు కేవలం 81 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉద్యోగాన్ని వదిలి సేవ చేసేందుకు వచ్చినా వార్డు ప్రజలు ఆదరించలేదు.

News February 14, 2026

జనగామ మున్సిపాలిటీలో వికసించని కమలం!

image

జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 26 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. కానీ, ఏ వార్డులో కూడా గట్టి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవని పట్టణంలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా సంపాదించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 26 వార్డుల్లో రెండు వార్డులు గెలుస్తాయనే ధీమా ఉన్నా.. జిల్లా అధ్యక్షుడి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఓడిపోయారని చర్చ జరుగుతోంది.