News March 27, 2024

బొత్సకు పోటీగా ఎవరు?

image

ఉమ్మడి విజయనరగం జిల్లాలో చీపురుపల్లి మినహా ఎన్డీఏ కూటమి మిగతా అభ్యర్థులు ప్రకటించింది. బొత్స సత్యనారాయణకు పోటీగా గంటా శ్రీనివాస్‌ను బరిలో దింపాలని టీడీపీ అధిష్ఠానం భావించినా.. ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో మీసాల గీత పేరును అధిష్ఠానం పరిశీలించింది. అంతేకాక విజయనగరం ఎంపీ అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా గీత పేరును చేర్చింది. దీంతో చీపురుపల్లి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

Similar News

News February 14, 2026

VZM: సుమారు 1000 మందితో భద్రత ఏర్పాట్లు

image

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. రామతీర్థం, పుణ్యగిరి, సంగం దేవాలయాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సుమారు 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. బందోబస్తులో నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 160 మంది ఎఎస్ఐలు, హెచ్సీలు విధులు నిర్వర్తిస్తారన్నారు.

News February 14, 2026

కోస్టల్ కారిడార్‌లో మార్పులు

image

సవరించిన VMRDA మాస్టర్ ప్లాన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అనుసంధాన బీచ్ కారిడార్‌కు స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. కోస్టల్ బ్యాటరీ-కైలాసగిరి వరకు 40M, అక్కడి నుంచి భోగాపురం వరకు 60M వెడల్పుతో రహదారి ప్రతిపాదన, రాడిసన్ బ్లూ వద్ద ఎలివేటెడ్ మార్గం, మూలకుద్దు సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి ప్రణాళికలో ఉన్నాయి. ఈ మార్పులు ట్రాఫిక్ సౌలభ్యం, పర్యాటక అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

News February 14, 2026

పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యం వద్దు: VZM కలెక్టర్

image

పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిబంధనల ప్రకారం అత్యంత వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న అనంతరం చట్టబద్ధమైన గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, వెంటనే దరఖాస్తులను పరిశీలించి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.