News April 19, 2025

బొత్స వ్యూహాలు ఫలించేనా

image

విశాఖలో ఉదయం 11 గంటలకు GVMC మేయర్‌పై అవిశ్వాస ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం కూటమికి ఉందని MLAలు చెబుతున్నారు. YCP కార్పొరేటర్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ MLC బొత్స పిలుపునిచ్చారు. అదిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కూటమిలోని పలువురు కార్పొరేటర్‌లతో బొత్స సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరి మేయర్ పీఠంపై బొత్స వ్యూహాలు ఫలిస్తాయా?

Similar News

News July 6, 2025

భవాని దేశానికే గర్వకారణం: హోం మంత్రి అనిత

image

కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పథకాలు సాధించిన విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవానీని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఈమె దేశానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.

News July 6, 2025

జిందాల్ భూముల వ్యవహారంపై స్పందించిన మంత్రి

image

జిందాల్ భూముల వ్యవహారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ‘ఎక్స్’ వేదికగా ఆదివారం స్పందించారు. జిందాల్ భూముల్లో MSME పార్కుల అభివృద్ధి ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని, ఆ పార్కుల్లో ఏ పరిశ్రమలు వస్తాయనేది ఇంకా స్పష్టత లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేస్తేనే నీరు సరఫరాపై ఆలోచించాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్వాసిత రైతులకు ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలుంటే వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందన్నారు.

News July 6, 2025

హెల్మెట్ ధరించి రక్షణ పొందండి: ఎస్పీ

image

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రక్షణ పొందాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై గోల్డెన్ అవర్స్‌లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. హెల్మెట్ ధరిస్తే దెబ్బలు తగిలినప్పటికీ ప్రాణాలతో బతికే అవకాశం ఉందన్నారు.