News December 10, 2025
బొదులూరు పీహెచ్సిని ఆకస్మిక తనిఖీలు చేసిన ఐటీడీఏ పీవో

మారేడుమిల్లి మండలంలోని బొదులూరు పీహెచ్సిని రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరన్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందుతుందా, వైద్య పరీక్షలు చేస్తున్నారా అనే వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
Similar News
News December 15, 2025
నక్కపల్లి డివిజన్ నుంచి 3 మండలాలు మినహాయింపు: మంత్రి కొల్లు

కొత్తగా ఏర్పాటు చేయబోయే నక్కపల్లి రెవెన్యూ డివిజన్ నుంచి మునగపాక, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాలను మినహాయించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వీటిని అనకాపల్లిలో కొనసాగించాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీనిపై వైసీపీ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
News December 15, 2025
కొబ్బరి ఉప ఉత్పత్తుల పరిశ్రమలపై కలెక్టర్ సమీక్ష

కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించే దిశగా అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం క్వాయర్ బోర్డు ప్రతినిధులతో కలెక్టర్ మహేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కొబ్బరి పీచు, కోకో పిట్, జియో టెక్స్టైల్స్, డోర్ మ్యాట్ల తయారీపై చర్చించారు. జిల్లాలో క్వాయర్ పరిశ్రమల ఏర్పాటుకు గల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నామని, దీనిపై వారం రోజుల్లో మరోసారి పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
News December 15, 2025
MBNR: ఆరోజు వైన్ షాపులు బంద్: ఎస్పీ

పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో లేదా 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పూర్తిగా నిషేధమని ఎస్పీ డి.జానకి తెలిపారు. మూడో విడుత సర్పంచ్ ఎన్నికల భద్రతా దృష్ట్యా మద్యం దుకాణాలు ఈనెల 15 సా.5:00 గంటల నుంచి 18 ఉ.10:00 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని, మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


