News February 26, 2026
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.
Similar News
News February 28, 2026
కాకినాడ విషాదం.. ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం

AP: కాకినాడ(D) వేట్లపాలెంలో జరిగిన భారీ <<19263594>>పేలుడు<<>> ఘటనలో 20 మంది మృతిచెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వేట్లపాలెంలో బాధితులను పరామర్శించిన అనంతరం తెలిపారు.
News February 28, 2026
డూ ఆర్ డై మ్యాచ్.. ఫర్హాన్ సెంచరీ

T20WC: సెమీస్ చేరాలంటే భారీ మార్జిన్‌తో గెలవాల్సిన మ్యాచులో పాకిస్థాన్ బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్ జమాన్(84) పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఫర్హాన్ 59 బంతుల్లో సెంచరీ బాదారు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. మరోవైపు చివర్లో 11 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడంతో పాక్ 212/8కి పరిమితమైంది.
News February 28, 2026
హార్ముజ్ నుంచి రవాణా బంద్

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇతర దేశాల చావుకొచ్చింది. హార్ముజ్ జలసంధి నుంచి రవాణా ఆపేస్తున్నట్లు పలు మేజర్ ముడిచమురు, ఇంధన, నేచురల్ గ్యాస్ కంపెనీలు ప్రకటించినట్లు రాయిటర్స్ తెలిపింది. కొన్నిరోజులు తమ ఓడలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 30% రవాణా ఈ జలసంధి నుంచే అవుతుండగా ప్రస్తుత పరిణామాలతో వాటి ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఈ ప్రభావం INDపైనా పడనుంది. ఇప్పటికే Gold, Silver ధరలు పెరుగుతున్నాయి.


