News September 11, 2025

బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8: అన్నమయ్య కలెక్టర్

image

ఇవాళ్టి బొప్పాయి ధరలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8, సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7గా నిర్ణయించామన్నారు. ట్రేడర్లు తక్కువ ధరకు తీసుకుంటే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమును (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.

Similar News

News September 11, 2025

సంగారెడ్డి: జిల్లాలో 7,44,157 మంది ఓటర్లు

image

జిల్లాలోని 613 పంచాయతీల్లో 7,44,157 మంది ఓటర్ల ఉన్నారని జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం 1458 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 25 జడ్పీటీసీ, 221 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు వివరించారు.

News September 11, 2025

సంగారెడ్డి: పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎఎన్ఎం, అకౌంటెట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విధాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ ఖాళీగా ఉన్న పోస్టులకు మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను ఈనెల 15వ తేదీ లోగ జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News September 11, 2025

MHBD: కలెక్టర్ పేరిట వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దు: కలెక్టర్

image

మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరుతో వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించ వద్దని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కొత్త వాట్సాప్ నంబర్ సృష్టించినట్లు తెలిసిందని, ఈ నకిలీ నంబర్‌కు ఎవరూ స్పందించవద్దని సూచించారు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి, కలెక్టర్ పేరుతో వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందించవద్దన్నారు.