News November 20, 2025
బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
Similar News
News April 14, 2026
పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,470 పెరిగి రూ.1,53,930కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,41,100 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News April 14, 2026
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News April 14, 2026
3,058 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్

రైల్వేలో 3,058 NTPC(UG) ఉద్యోగాలకు పరీక్షల తేదీలను RRB విడుదల చేసింది. మే 7, 8, 9, జూన్ 13, 14, 16-21 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు 10 రోజుల ముందు అభ్యర్థులకు కేటాయించిన సిటీ పేరు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. రోజూ 3 షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉంటుంది.


