News April 10, 2024
బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

బొబ్బిలి – సీతానగరం రైల్వేస్టేషన్ల మధ్య చిన భోగిలి సమీపంలో, బుధవారం గుర్తు తెలియని మృతదేహాం లభ్యమయ్యిందని బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ ఈశ్వరరావు తెలిపారు. ట్రైన్ నుంచి జారిపడి మృతిచెందారా, లేదా పట్టాలు దాటే క్రమంలో ట్రైన్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 13, 2026
VZM: ‘ఆ సర్టిఫికేట్ అందించకపోతే పెన్షన్ కట్’

రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్, కుటుంబ పెన్షన్ దారులు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందేందుకు నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ అందించాలని జిల్లా ట్రైజరీ అధికారి వి.నాగ మహేశ్ శుక్రవారం తెలిపారు. ఈ 28వ తేదీలోపు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఇవ్వల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో Jeevan Pramaan యాప్ ద్వారా ఇంటి నుంచే జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చునని పేర్కొన్నారు.
News February 13, 2026
గంట్యాడ: పచ్చకామెర్లతో యువకుడి మృతి

గంట్యాడ మండలం కొండ తామరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు పచ్చకామెర్లతో మృతి చెందాడు. కోన పవన్ కుమార్ (22) జ్వరం, పచ్చకామెర్లు రావడంతో 5 రోజుల క్రితం విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. పవన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉన్న పవన్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
News February 13, 2026
హ్యూమన్ రైట్స్ పేరుతో బెదిరింపులు చేస్తే జైలుకే: ఎస్పీ

హ్యూమన్ రైట్స్ కమిషన్, RTI ప్రతినిధులమని చెబుతూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. గ్రామస్థాయిలో ఇటువంటి సంస్థలకు ఎటువంటి ప్రైవేట్ ప్రతినిధులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా గుర్తింపు కార్డులు చూపి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.


