News March 25, 2024
బొబ్బిలి ఎమ్మెల్యేపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు

బొబ్బిలి MLAపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుతో పాటు మరికొంత మంది వైసీపీ నాయకులపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిత్రకోట, బొడ్డవలస పంచాయతీలోని ఎంసీసీ కోడ్‌కు వ్యతిరేకంగా పార్టీ ప్రచారం చేస్తున్నారన్న అభియోగంపై ఏఆర్‌ఓ, RDO సాయి శ్రీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు S.I తెలిపారు.
Similar News
News January 27, 2026
VZM: ‘పట్టాదారు పాసుపుస్తకాల్లో 50 శాతం తప్పులు’

ప్రస్తుతం ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలలో కనీసం 50 శాతం వరకు తప్పులు ఉన్నాయని JC ఎస్.సేధు మాధవన్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సిబ్బంది శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని సరిదిద్దిన తరువాతే ఖచ్చితమైన పాస్ పుస్తకాలు రూపొందించాలని సూచించారు. రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చిన అర్జీలను వారం నుంచి 10రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.
News January 27, 2026
VZM: రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ఫోకస్

రెవెన్యూ, రీ సర్వే సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించడంపై జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి, వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. తప్పులు లేని రెవెన్యూ రికార్డులు రూపొందించాలన్నారు.
News January 26, 2026
విజయనగరం కలెక్టర్ కాంప్ కార్యాలయంలో ఘనంగా ఎట్ హోమ్ కార్యక్రమం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కాంప్ కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు శాస్త్రీయ సంగీతాన్ని మనోహరంగా ఆలపించారు. జిల్లా అధికారులు, సిబ్బంది సందడిగా గడిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, SP దామోదర్, JC సేధు మాధవన్, కమాండెంట్ మహేష్, అదనపు SP సౌమ్యలత, DRO మురళి పాల్గొన్నారు.


