News August 23, 2024
బొబ్బిలి చరిత్రపై కథ..!

కృష్ణం వందే జగద్గురుం సినిమాతో మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయిమాధవ్ బొబ్బిలిలో పర్యటించారు. స్థానిక కోటలో ఎమ్మెల్యే బేబినాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బొబ్బిలి చరిత్రపై కథ రాసే క్రమంలో ఎమ్మెల్యేను కలిసి చరిత్ర వివరాలు తెలుసుకున్నారు. బొబ్బిలి చరిత్ర విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Similar News
News February 6, 2026
విజయనగరంలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

విజయనగరం, పార్వతీపురం మన్యం డివిజన్ల పరిధిలోని సీతానగరం, కురుపాం, పెదబొండపల్లి, భీమసింగి, భోగాపురం తదితర 66 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 6, 2026
VZM: ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ పర్యటన

ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు విజయనగరం చేరుకుని బస చేస్తారు. శనివారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలుపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పత్రికా సమావేశం, 2:30లకు NDA నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి విశాఖకు వెళ్తారని జిల్లా సమాచార శాఖ గురువారం తెలిపింది.
News February 6, 2026
పదో తరగతి పబ్లిక్ ఫీజు కట్టని వారికి మరో అవకాశం

పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఫీజు కట్టని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని
చీపురుపల్లి స్థానిక ఉన్నత పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి గురువారం తెలియజేశారు. తత్కాల్ స్కీం ద్వారా అపరాధ రుసుం రూ.1000లు చెల్లించి నామినల్ రోల్స్‌లో ఈనెల 6 నుంచి 12 దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫీజును www//bse.ap.gov.in వెబ్సైట్‌లో లాగిన్ అయి CFMS బ్యాంక్ చలానా ద్వారా చెల్లించాలని సూచించారు.


