News September 17, 2025

బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్లు భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ బలగ పోతయ్య తెలిపారు. ఈనెల 27లోగా iti.ap.gov.in వెబ్సైట్‌లో టెన్త్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు 28న సర్టిఫికేట్స్ వేరిఫికేషన్‌కు ఒరిజినల్ సర్టిఫికేట్స్, అన్ని పత్రాలతో రావాలన్నారు. >Share it

Similar News

News September 18, 2025

ఆసియా కప్‌: UAE టార్గెట్ 147 రన్స్

image

ఆసియా కప్‌లో భాగంగా UAEతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోర్ చేసింది. ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీతో రాణించగా చివర్లో షహీన్ ఆఫ్రిది (29*) బౌండరీలతో స్కోర్ బోర్డును పెంచారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రాన్‌జీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే యూఏఈ 20 ఓవర్లలో 147 రన్స్ చేయాలి. UAE గెలుస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.

News September 18, 2025

ఇల్లంతకుంట: ఉపాధ్యాయుడిలా మారిన కలెక్టర్

image

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయుడిలా మారారు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట మోడల్ స్కూలును బుధవారం ఆయన తనిఖీ చేశారు. కాసేపు ఉపాధ్యాయుడిలా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను విద్యార్థులతో నిత్యం చదివించి రాయించాలన్నారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠ్యాంశాలపై పట్టు వచ్చేలా పిల్లలకు బోధించాలన్నారు.

News September 18, 2025

వర్షపు నీటిని పొదుపు చేయాలి: ఆసిఫాబాద్ కలెక్టర్

image

భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసేందుకు వర్షపు నీటిని పొదుపు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో భూగర్భ నీటి వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుని, భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని ప్రజలు పొదుపుగా వినియోగించాలన్నారు.