News October 18, 2025
బొబ్బిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. విజయనగరం నుంచి రాయగడ వైపు వెళ్తున్న రైలు నుంచి జారీ పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.
Similar News
News October 18, 2025
ఓపెన్ టెన్త్, ఇంటర్ చదవడానికి దరఖాస్తులు ఆహ్వానం

ఓపెన్ టెన్త్, ఇంటర్ (2025–26)లో చదవడానికి ఆసక్తి గలవారు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టాస్ తెలంగాణ ఓపెన్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ (2025-26) విద్యా సంవత్సరానికి జిల్లాలో 1780 మందికి అవకాశం కల్పించగా, ఇప్పటివరకు కేవలం 1065 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News October 18, 2025
అనకాపల్లి: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో పోలీసులు శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రమదానంతో కార్యాలయం ఆవరణలో తుప్పలు తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీలు దేవ ప్రసాద్, మోహనరావు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.
News October 18, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణీ దారుణ హత్య

ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణి మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాం మండలం గేర్రె గ్రామంలో కోడలు రాణిని మామ సత్తయ్య దారుణంగా హత్య చేశాడు. కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో హత్య చేసి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.