News February 11, 2026
బొబ్బిలి: స్కూల్ బస్సు బోల్తా

బొబ్బిలి మండలం అలజంగి చెట్టు వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. కారాడ సమీపంలో ఉన్న సన్ రైజ్ ఆశ్రమానికి చెందిన విద్యార్థులు బొబ్బిలి పట్టణంలోని పలు విద్యాసంస్థలలో చదువుతున్నారు. పాఠశాలల నుంచి బుధవారం సాయంత్రం ఆశ్రమానికి వెళ్తుండగా అలజంగి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో 23 మంది విద్యార్థులకు గాయలయ్యాయి. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Similar News
News February 12, 2026
VZM: తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు

శివరాత్రికి రామతీర్థం, పుణ్యగిరి, ధర్మవరం, సంగమేశ్వర స్వామి ఆలయం, పాల్తేరు, కోటిపల్లి, తదితర శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు గతం కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. తొక్కిసలాట జరగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రవేట్ ఆలయాలకు సంబంధించి ఆలయ కమిటీలను అప్రమత్తం చేయాలన్నారు.
News February 12, 2026
VZM: ఆసుపత్రి ముంగిటే మృతి

విజయనగరం మహారాజ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి క్యాజువాలిటీ వద్ద సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు అచేతనంగా పడిఉన్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తమ వైద్య సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని లోపలికి తీసుకువెళ్లి చికిత్స అందించారని అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు సూపరింటెండెంట్ డా.పద్మజ తెలిపారు.
News February 12, 2026
బాడంగి: ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి

బాడంగి మండలం రావివలస గ్రామానికి చెందిన అప్పలస్వామి (70) మంగళవారం ఉత్తరవల్లిలో బంధువులు ఇంటికి వెళ్లాడు. అప్పలస్వామి వెళ్లి రోజు గడిచినా ఇంటికి రాకపోవడంతో కుమారుడు ఆచూకీ కోసం వెతకగా ఊరు సమీప చెరువులో మృతదేహం కనిపించింది. చెరువులో ఉన్న డెడ్ బాడీ తన తండ్రిదేనని కుమారుడు గుర్తించాడు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసుకు బుధవారం ఫిర్యాదు చేశాడు. హెచ్‌సీ ప్రసాదరావు కేసు నమోదు చేశారు.


