News February 15, 2025

బొమ్మగాని ధర్మభిక్షం.. మూడు చోట్ల

image

బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి NLG జిల్లాలో మూడు చోట్ల పోటీచేసి ప్రతీ చోటా విజయం సాధించారు. SRPT ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో 1952 ఎన్నికల్లో ధర్మభిక్షం PDF అభ్యర్థిగా పోటీచేసి జీఏరెడ్డి మీద, 1957లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్‌ అసెంబ్లీ స్థానం నుంచి PDFఅభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి KVరావుపై, 1962లో NLG నుంచి CPI అభ్యర్థిగా పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ రవూఫ్‌పై విజయం సాధించారు.

Similar News

News November 1, 2025

ఆదిలాబాద్: ఓపెన్ ఫలితాలు విడుదల

image

TOSS ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైనట్లు DEO ఖుష్బూ గుప్తా, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్ తెలిపారు. సెప్టెంబర్ 22 – 28వరకు జరిగిన పరీక్షల ఫలితాలు https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. మెమోల్లో పొరపాట్లుంటే ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి రీకౌంటింగ్ కోసం పేపర్ కు రూ.350, ఇంటర్‌కు రూ.400 చెల్లించాలన్నారు.

News November 1, 2025

శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతున్న దొంగతనాలు

image

జిల్లాలో వరుస చోరీ ఘటనలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. తూ.గో జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఈ నెల 10న నరసన్నపేటలో ట్రాన్స్‌జెండర్లు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తాజాగా కాశీబుగ్గలో చోరీ, సారవకోట(M) బుడితిలో వృద్ధురాలి మెడలో బంగారం చోరీ చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్న AP, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

News November 1, 2025

నేడు లండన్‌ వెళ్లనున్న సీఎం దంపతులు

image

AP: CM చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇవాళ లండన్ వెళ్లనున్నారు. ఈనెల 4న ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ <<17985147>>అవార్డును<<>> అందుకోనున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్‌ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ భువనేశ్వరి స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. విశాఖలో జరిగే CII సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. ఈనెల 6న తిరిగి అమరావతి చేరుకుంటారు.