News December 8, 2025

బొమ్మూరు: స్టార్టప్‌ ఐడియా ఉందా? రండి.. ‘స్పార్క్‌’ చూపిద్దాం!

image

నూతన ఆవిష్కరణలు, వినూత్న వ్యాపార ఆలోచనలు ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 9 నుంచి 11 వరకు ‘స్పార్క్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ వై. మేఘ స్వరూప్‌తో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో జరిగే శిక్షణలో నిపుణులు దిశానిర్దేశం చేస్తారన్నారు. నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.

Similar News

News March 2, 2026

పోలీస్ పీజీఆర్ఎస్‌లో 31 అర్జీలు: ఎస్పీ నర్సింహ కిషోర్

image

రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజిఆర్ఎస్ జరిగింది. ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధికారులతో కలిసి బాధితుల నుంచి 31 అర్జీలను స్వీకరించారు. కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం బాధితులకు ఎంతో తోడ్పాటును అందిస్తోందన్నారు. వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

News March 1, 2026

రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

image

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 1, 2026

తూ.గో: ఇక ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

image

రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తూ.గో రవాణాధికారి ఆర్. సురేశ్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ‘Sarathi Parivahan’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్ చెల్లింపుల వంటి సేవలను ‘Vahan Parivahan’ పోర్టల్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.