News August 6, 2024
బొర్రా గుహలను కాపాడాలని వినతి

బొర్రా గుహలను కాపాడాలంటూ అరకు ఎంపీ డా.గుమ్మా తనూజ రాణి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆఫీసులో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. బొర్రాగుహలపై నుంచి వేసే రెండో రైల్వే లైన్ ఎలైన్మెంట్ 40మీటర్లు జరపాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే బొర్రా గుహలకు పెను ప్రమాదం ఉందని, గుహలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News July 9, 2025
సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.
News July 9, 2025
‘అప్పుఘర్ వద్ద సిద్ధంగా గజఈతగాళ్ళు’

అప్పుఘర్ వద్ద గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నేడు జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అజిత జువేరి, లక్ష్మీనారాయణ పరిశీలించారు. అప్పుఘర్‌లో గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీలు ఏసీపీ నర్సింహామూర్తికి పలు సూచనలు చేశారు. విద్యుత్ వెలుగులతో పాటు బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.