News April 3, 2025

బొల్లాపల్లి: కన్న తల్లిని హతమార్చిన కొడుకు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 8, 2025

బీటెక్ విద్యార్థి అరెస్ట్: సింగరాయకొండ సీఐ

image

గుంటూరుకు చెందిన విద్యార్థి రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన రాజు టంగుటూరులోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉండే అతను వేరే చోటు నుంచి గంజాయి తీసుకు వచ్చి యువకులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర అదుపులోకి తీసుకున్నారు. సుమారు 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News April 8, 2025

ఓటీటీలకు సెన్సార్ అవసరం: దిలీప్ రాజా

image

తెనాలిలోని మా ఏపీ కార్యాలయంలో సోమవారం కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు దిలీప్ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీల్లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్, సినిమాల్లో శృంగార దృశ్యాలు యువతపై మానసిక ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి సెన్సార్ విధించడం ద్వారా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కేంద్ర సమాచారశాఖకు పలు విజ్ఞప్తులు పంపినట్టు చెప్పారు. పోర్న్ సైట్లపై కూడా నిషేధం అవసరమని అన్నారు.

News April 8, 2025

హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పార్థసారథి

image

ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న వైవిఎస్‌బిజి పార్థసారధి నియమితులయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌గా మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించారు. కేసులు పెండెన్సీ తగ్గించడంలో పార్థసారధి విశేష కృషి చేశారు. ఆయన చొరవతో లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న అత్యధిక కేసులు పరిష్కారం ఆయ్యాయి.

error: Content is protected !!