News September 10, 2025

బోధన్‌లో ఉగ్రమూలాలు ఉన్న వ్యక్తి అరెస్ట్

image

బోధన్‌లో ఉగ్ర మూలాలు ఉన్న ఓ వ్యక్తిని NIA బృందం బుధవారం అదుపులోకి తీసుకుంది. ఐసీస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా క్రమంలో NIA అధికారులు డానీష్ అనే వ్యక్తిని ఝార్ఖండ్‌లో అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు బోధన్‌లో ఉగ్రమూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి NIA కస్టడీకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీ స్వాధీనం చేసుకోని.. విచారిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.

Similar News

News September 11, 2025

ప్రొద్దుటూరు: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

image

ప్రొద్దుటూరు జార్జ్ కారొనేషన్ క్లబ్లో బుధవారం ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి అండర్ 14, 17 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభను చూపిన 40 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాజుపాలెం ఎంఈవో ప్రసాద్, హెచ్ఎం ఇమామ్ హుస్సేన్, పీడీలు పోటీలను పర్యవేక్షించారు.

News September 11, 2025

బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8: అన్నమయ్య కలెక్టర్

image

ఇవాళ్టి బొప్పాయి ధరలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8, సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7గా నిర్ణయించామన్నారు. ట్రేడర్లు తక్కువ ధరకు తీసుకుంటే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమును (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.

News September 11, 2025

బ్లూమ్‌బర్గ్ ఛాలెంజింగ్ పోటీలకు విశాఖ ఎంపిక

image

బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో విశాఖ ఎంపికైందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 99 దేశాల్లో 600 నగరాలు పోటీ పడగా 50 నగరాలను ఫైనల్‌కు చేశారని, ఇందులో విశాఖ నిలిచిందని చెప్పారు. ప్రతి పౌరుడు జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్‌తో తమ ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలు పంచుకోవాలన్నారు. ఈనెలలో 19వ వార్డులో వర్క్ షాప్ నిర్వహించనున్నామన్నారు.