News November 18, 2024
బోధన్‌లో గుండెపోటుతో యువకుడి మృతి
బోధన్ మండలం లంగ్డాపూర్ గ్రామానికి చెందని అనిల్ ఆదివారం గుండె పోటుతో మృతి చెందాడు. ఆదివారం ఉదయం అనిల్‌కు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే అనిల్ మృతి చెందడంతో గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.
Similar News
News November 18, 2024
‘కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి’: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు, కులాలకు సమానంగా చూస్తుందని TG రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కొన్ని పార్టీలు దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాయని ఎద్దేవా చేసారు. ఆదివారం నాందేడ్ లోని శ్రావస్తి నగర్ లో ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నాందేడ్ నార్త్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
News November 17, 2024
మోస్రా: ప్రమాదవశాత్తు కాలువలో జారి పడి వ్యక్తి మృతి
మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెద్దిగారి శోభన్(40) తన పొలంలో నారు మడికి నీరు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోకల రమేశ్ తెలిపారు.
News November 17, 2024
ఆర్మూర్: మానవత్వం చాటుకున్న ASI సలీం
ASI సలీం మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రంలో గ్రూప్-3 పరీక్ష రాయడానికి ఓ మహిళ తన కుమారుని తీసుకొని వచ్చింది. పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రానికి రాగా ఆమె బంధువులు తనతో ఎవరూ లేరు. బాబుని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. అక్కడ డ్యూటీలో ఉన్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ASI సలీం బాబు తండ్రి వచ్చేవరకు తన వద్ద ఉంచుకున్నారు. అనంతరం బాబును తండ్రి వచ్చిన తర్వాత అప్పగించారు.