News January 26, 2026

బోధన్: గుర్తుతెలియని కూలీ మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ఆరా

image

బోధన్ రూరల్ PS పరిధిలో గుర్తుతెలియని అడ్డా కూలీ మృతి చెందాడు. సాలంపాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి నాని అనే కూలీని పనికి తీసుకెళ్లగా, పని అనంతరం అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు కూలీ మరణించాడు. మృతుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తోంది. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే బోధన్ రూరల్ ఎస్సై 87126 59872 నంబరుకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Similar News

News February 14, 2026

NZB: మేయర్ బరిలో బీసీ అభ్యర్థులు..!

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ నుండి ప్రస్తుతం ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శమంత పేరు వినిపించినప్పటికీ ఆమె ఓటమి చెందడంతో ఇప్పుడు తాజాగా బీసీ నినాదంతో 2 కొత్త పేర్లు తెరమీదకు వచ్చాయి. 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి (ముదిరాజ్), 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత (మున్నూరు కాపు) పేర్లు వినిపిస్తున్నాయి.

News February 14, 2026

దుబాయిలో నందిపేట మండల యువకుడి మృతి

image

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్‌లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

News February 14, 2026

NZB: మేయర్ పీఠం కోసం వారి ఓట్లే కీలకం

image

NZB నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇందు కోసం MP, MLA, MLCలు తమకు ఓటు ఉన్న జిల్లా పరిధిలో ఎక్స్అఫీషియో సభ్యుడి ఓటరుగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. దీంతో BJPకి చెందిన MP, NZB(U), ARMR MLAలతో పాటు ఇద్దరు MLCలు, కాంగ్రెస్‌కు చెందిన NZB(R), BDN MLAలతో పాటు జిల్లాకు చెందిన MLC మహేశ్ కుమార్ గౌడ్ ఓట్లు నమోదు చేసుకోనున్నారు.