News November 27, 2025

బోధన్: 13 నెలల చిన్నారిని చిదిమేసిన ఆటో

image

సాలూరు మండలం సాలంపాడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి ఉల్లిగడ్డలు అమ్ముకోవడానికి ఆటోలో వచ్చిన వ్యక్తి అజాగ్రత్తగా నడిపి గ్రామానికి చెందిన 13 నెలల చిన్నారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఇర్ఫాన్, అయోష బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ బోధన్‌కు చెందిన అబ్దుల్ ఖాదర్‌గా గుర్తించారు.

Similar News

News November 27, 2025

విజయవాడ చేరుకున్న నిర్మలా సీతారామన్

image

అమరావతి ప్రాంతంలో శుక్రవారం పలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడ చేరుకున్నారు. తొలుత ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా పలువురు అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె విజయవాడలోని నోవాటెల్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడ బస చేసి రేపు ఉదయం 9:30 నిమిషాలకు బయలుదేరి అమరావతి CRDA కార్యాలయం వద్దకు చేరుకుంటారు.

News November 27, 2025

వనపర్తి: తొలిరోజు 26 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు.!

image

వనపర్తి జిల్లాలో మొదటి విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీల్లోని 780 వార్డులకు ఈరోజు మొత్తం 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
✓ ఘణపురం మండలం -4
✓ గోపాల్ పేట మండలం -10
✓ పెద్దమందడి మండలం -3
✓ రేవల్లి మండలం -8
✓ ఏదుల మండలం -1 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.

News November 27, 2025

అమరావతి: ‘రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సహకరిస్తాం’

image

CM చంద్రబాబుతో సమావేశం సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడారు. రాజధాని కోసం JACలు ఏర్పాటు చేసుకొని ఉద్యమించామని, ఇక అమరావతి డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటామన్నారు. 2వ విడత భూసమీకరణకు పూర్తిగా సహకరిస్తామని, CM రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే తమకు మేలు జరుగుతుందని, ల్యాండ్ పోలింగ్‌కు ఇవ్వని వారిని పిలిపించి మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు.