News February 4, 2025
బోనకల్‌లో సినీ నిర్మాత కేపీ.చౌదరి అంత్యక్రియలు

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన సినీ నిర్మాత కేపీ.చౌదరి సోమవారం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వస్థలమైన రాయన్నపేట గ్రామానికి తీసుకురానున్నారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
Similar News
News February 25, 2026
BIG BREAKING: నాగర్‌కర్నూల్ ఘటన.. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకటన

నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో నేరస్థులైన ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. A1-ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, A2-మధు రెడ్డి, A3-శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. రెండు నెలల చిన్నారి మృతదేహం పోస్టుమార్టం రిపోర్ట్‌లో అంతర్గతంగా, బహిర్గతంగా ఎలాంటి గాయాలు లేవని నివేదిక వచ్చిందని, RFSL రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
News February 25, 2026
కంబాలకొడం అభివృద్ధి కి బృహత్ ప్రణాళిక

కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. ఈఎస్ జెడ్ పరిధిలో 30.51 చ.కి.మీ. విస్తీర్ణానికి ముసాయిదా జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రహదారుల అనుసంధానం, భవిష్యత్ రహదారి మార్గాలు స్పష్టంగా చేర్చాలని సూచించారు. పర్యావరణహితంగా పర్యాటక కార్యకలాపాలు రూపకల్పన చేయాలని అటవీ అధికారులు పేర్కొన్నారు.
News February 25, 2026
AC ధరలు హీటెక్కిస్తాయి!

ఈ వేసవిలో AC కొనాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే! రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు మండిపోతుండటం, రూపాయి విలువ తగ్గడంతో ACల రేట్లు 5 నుంచి 15% పెరుగుతాయని వోల్టాస్ ఎండీ ముకుందన్ మేనన్ చెప్పారు. రాగి టన్నుకు 13 వేల డాలర్లు పలుకుతోంది. దీంతో పాటు కొత్త పవర్ సేవింగ్ రూల్స్ వల్ల ACల తయారీ ఖర్చు భారమైంది. ధరలు పెరిగినా ఈసారి అమ్మకాలు కూడా 20% పెరుగుతాయని ముకుందన్ తెలిపారు.


