News November 13, 2024

బోనకల్: కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

image

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క సమక్షంలో వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజా పాలనతో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వంట గ్యాస్ రూ.500కి అందించడమే కాక, అభివృద్ధి పథంలో మధిర నియోజకవర్గం నిలుస్తోందని నందిని విక్రమార్క తెలిపారు.

Similar News

News November 7, 2025

ఖమ్మం: వందేమాతరం గీతాలాపనలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.శ్రీజ మాట్లాడుతూ.. కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.

News November 7, 2025

ఖమ్మం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘వందే మాతరం’

image

జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో వందే మాతరం జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.

News November 7, 2025

కూసుమంచి: పంట నష్టం నమోదుకు పడవ ప్రయాణం

image

కూసుమంచి మండలం పాలేరు క్లస్టర్ ఏఈవో సాయిరాం తన వృత్తి నిబద్ధతను చాటారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు దారి లేకపోవడంతో, ఆయన ఓ మత్స్యకారుని సహాయంతో పడవపై ప్రయాణించారు. పంట నష్టాన్ని నమోదు చేసి, రైతులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ సాహసం చేసిన ఏఈవో సాయిరామ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి