News July 11, 2024
బోనమెత్తిన డిప్యూటీ సీఎం సతీమణి

మధిర: ఆషాఢ బోనాలు సందర్భంగా ప్రజా భవన్ నుంచి డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్క సంప్రదాయంగా బోనాలు తయారు చేశారు. అనంతరం బోనాలను ఎత్తుకొని ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. అదేవిధంగా ఎల్లమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సంగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద పసుపు పంట కొనుగోలు చేయాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్చిలో అధిక మొత్తంలో పసుపు పంట మార్కెట్‌కు వచ్చే అవకాశముందని, రైతులు నష్టపోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
News March 13, 2025
‘ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు’

∆} సత్తుపల్లి: ‘మద్యం మత్తులో ఢీ.. ఇద్దరికి గాయాలు’ ∆} ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ ∆} సత్తుపల్లి: పురుగు మందుతో రైలు పట్టాలపై ఆందోళన ∆} వైరాలో ప్రమాదం.. ఒకరు మృతి ∆} ఖమ్మం: ఐదుగురికి షోకాజ్ నోటీసులు ∆}ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం ∆}ఖమ్మం: ఎలక్ట్రికల్ షాప్‌లో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం ∆} ఖమ్మం: ‘ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి’.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ఖమ్మం జిల్లాకి ఏం కావాలంటే..?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.ఖమ్మం మున్నేరు పై తీగల వంతెన నిర్మాణం, పాలేరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిధులు, సీతారామ ప్రాజెక్ట్, రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలంటున్నారు.