News July 20, 2024

బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

image

అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు‌ లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్‌ బలగం‌ అంతా రేపు సికింద్రాబాద్‌‌లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు‌ కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు. ‌

Similar News

News August 16, 2025

HYD: ఖజానా దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్

image

చందానగర్ ఖజానా దోపిడీ కేసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ DCP వినీత్ తెలిపారు. బిహార్‌కు చెందిన ఆశిష్, దీపక్‌ను అరెస్టు చేశామని, వీరిని పుణెలో పట్టుకున్నామన్నారు. చోరీ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని, నిందితులంతా బిహార్ వాసులుగా గుర్తించామన్నారు. నిందితుల నుంచి గోల్డ్ కోటెడ్ సిల్వర్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News August 15, 2025

రంగారెడ్డి కలెక్టరేట్‌లో వేం నరేందర్ రెడ్డి జెండా ఆవిష్కరణ

image

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

News August 14, 2025

రంగారెడ్డి: మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గం: జస్టిస్ కర్ణకుమార్

image

వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని జిల్లా ప్రధాన జడ్జి, DLSA ఛైర్మన్ జస్టిస్ కర్ణకుమార్ అన్నారు. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘మధ్యవర్తిత్వం ఫర్ ద నేషన్’ వేళ మాట్లాడారు. కేసులు వేగంగా, తక్కువ ఖర్చు, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ఉత్తమ మార్గమన్నారు. పెండింగ్ కేసులు తగ్గి, న్యాయవ్యవస్థ వేగవంతమవుతుందన్నారు. DLSA కార్యదర్శి శ్రీవాణి ఉన్నారు.