News August 18, 2025

బోయపల్లి ఎస్సీ కాలనీలో కలెక్టర్ పర్యటన

image

తాండూర్ మండలం బోయపల్లి గ్రామ ఎస్సీ కాలనీని కలెక్టర్ దీపక్ కుమార్ సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి సందర్శించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు‌. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News August 18, 2025

ఎండాడ: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

image

సముద్రంలో ఎండాడకు చెందిన జాలరి పిల్లా సతీష్ (24) గల్లంతయ్యాడు. అలల ఉద్ధృతికి తీరంలో ఆరబెట్టిన వలలు కొట్టుకుపోతుండగా.. వాటి కోసం వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయాడు. మధ్యాహ్నం వరకూ చూసిన తండ్రి వీర్రాజు తమ వారితో తీరంలో వెతికినా జాడ లేకపోవడంతో ఎంవీపీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు.

News August 18, 2025

భద్రాద్రి యువతకు ఉద్యోగ మేళా

image

భద్రాద్రి ఏజెన్సీ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహిస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్ ఈరోజు తెలిపారు. హైదరాబాద్‌లోని బయోకాన్ కంపెనీలో అప్రెంటిస్‌గా పనిచేయడానికి B.Sc కెమిస్ట్రీ, M.Sc కెమిస్ట్రీ/డిప్లొమా కెమికల్/B.Tech కెమికల్ విద్యార్హతలు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌‌తో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.

News August 18, 2025

బందీల విడుదలకు అంగీకరించిన హమాస్!

image

ఇజ్రాయెల్‌తో 60 రోజుల సీజ్‌ఫైర్‌కు పాలస్తీనా టెర్రర్ గ్రూప్ హమాస్ అంగీకరించిందని Reuters తెలిపింది. ఈ మేరకు మిగిలిన బందీలను విడుదల చేయనుందని పేర్కొంది. అదే సమయంలో గాజా నుంచి ఇజ్రాయెల్ క్రమంగా తమ బలగాలను వెనక్కి తీసుకోనుందని చెప్పింది. అయితే బందీలందరినీ వదిలేసి ఆయుధాలను పక్కనపెడితేనే యుద్ధం ఆపుతామని గతంలో ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ సీజ్‌ఫైర్ ఎన్ని రోజులు అమల్లో ఉంటుందో చూడాలి.