News September 20, 2025

బోయినపల్లిలో రియల్ ఎస్టేట్ మోసం.. భార్యాభర్తల అరెస్ట్

image

రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడిన దంపతులను బోయిన్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి ప్రాంతానికి చెందిన పరశురాములు, ఆయన భార్య మాధవి ‘స్కంద శ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్’ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి రమ్య, వీణ అనే మహిళల నుంచి రూ.22.50 లక్షలు వసూలు చేశారు. డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

Similar News

News September 20, 2025

మహబూబ్‌నగర్: 23న సౌత్ జోన్ ఎంపికలు

image

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీ కబడ్డి, ఆర్చరి (స్త్రీ, పురుషుల విభాగంలో) ఎంపికలు ఉంటాయని యూనివర్సిటి PD డా. వై. శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. ఈనెల 23న పాలమూరు యూనివర్సిటీలోని పీజీ కళాశాల గ్రౌండ్లో కబడ్డి (స్త్రీ,పురుషుల) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోపు ఉండాలి, ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్ పై ప్రిన్సిపల్/PD సంతకం ఉండాలన్నారు.

News September 20, 2025

పల్నాడు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం: సీఎం

image

పల్నాడు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మాచర్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పల్నాడుకు ఎంతో చరిత్ర ఉందన్నారు. పల్నాడు చరిత్ర భావితరాలకు తెలియవలసిన అవసరం ఉందన్నారు. పల్నాడు ఉత్సవాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

News September 20, 2025

ఉగ్ర కలకలం.. రాంచీలో ISIS రిక్రూట్‌మెంట్ శిబిరం

image

ఝార్ఖండ్‌లోని రాంచీలో ISIS ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ శిబిరం బట్టబయలైంది. కొన్నిరోజుల కిందట ఈ నగరంలో అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్‌‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి విచారణలో ఉగ్ర శిబిరం గురించి తెలియడంతో రైడ్ చేశారు. అక్కడ పెద్దఎత్తున బాంబు తయారీ పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.