News February 26, 2026
బోయినపల్లి: CMO అధికారిని అంటూ మోసం.. అరెస్ట్

రంగారెడ్డి జిల్లా కుట్లూరు ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ బెట్టింగులకు బానిసై అధిక డబ్బు సంపాదించాలని దొంగతనాలకు అలవాటుపడ్డాడు. మోటార్ సైకిల్ దొంగలించిన కేసులో అరెస్టై జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తానని చెప్పి బోయినపల్లి మిడ్ మానేరు DEE రఘుపతికి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రఘుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.
Similar News
News February 27, 2026
NLG: రోడ్డు ప్రమాదం.. పంచాయతీ సెక్రటరీ మృతి

అనుముల మండలంలోని పులిమామిడి పంచాయతీ కార్యదర్శి అవుట మోహన్‌రావు (50) శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ నుంచి విధులకు వెళ్తుండగా లింగోటం వద్ద ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మోహన్‌రావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్వగ్రామం తిప్పర్తి మండలం పజ్జూరు.
News February 27, 2026
మాదారం చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

ఊర్కొండ మండలం రాచలపల్లికి చెందిన బూర్గుల వెంకటయ్య(46) శుక్రవారం మాదారం చెరువులో శవమై తేలారు. రెండు రోజులుగా గల్లంతైన ఆయన కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, ఈ ఉదయం చెరువులో మృతదేహం కనిపించింది. వెంకటయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని ఇంకా బయటకు తీయాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
News February 27, 2026
ఏలూరు జిల్లాలో వైరల్‌గా మారిన ఉద్యోగిని లెటర్

ఏలూరులోని తంగెళ్ల మూడి సచివాలయంలో ANMగా పనిచేస్తున్న కామేశ్వరి రాసినట్లు ఉన్న లేఖ సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. పని ఒత్తిడిలో తాను అలసిపోయానని, సెలవు ఇప్పించాలని ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నట్లు ఉంది. సెలవు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో కామేశ్వరి బుధవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తన మెంటల్ కండీషన్ బాగోలేదని లేఖలో రాసినట్లు ఉంది.


