News December 24, 2025

బోరబండలో BRS‌ను పాతిపెట్టినం: CM రేవంత్ రెడ్డి

image

కోస్గి సభలో BRS, KCR మీద CM రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ‘BRSను అసెంబ్లీలో ఓడగొట్టినం. లోక్‌సభలో గుండు సున్నా ఇచ్చినం. కంటోన్మెంట్‌లో బండకేసి కొట్టినం. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోరబండ బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్‌లను గెలిపించుకున్నాం. ఇన్ని సార్లు BRSను ఓడించినా సిగ్గులేకుండా పైచేయి మాదే అంటున్నారు. పొంకనాలు వద్దు KCR చేతనైతే అసెంబ్లీకి రండి’ అంటూ CM సవాల్ చేశారు.

Similar News

News December 27, 2025

కరీంనగర్ కమిషనరేట్లో తగ్గిన క్రైమ్ రేట్

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 16.84% క్రైమ్ రేట్ తగ్గినట్లు క్రైమ్ యాన్యువల్ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. 2024లో 7,361 కేసులు నమోదు కాగా.. 2025 సంవత్సరంలో 6421 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 80% పైగా కేసులు పరిష్కారమయ్యాయి. దీంతో కరీంనగర్లో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా అమలవుతున్నట్టు స్పష్టమవుతుంది.

News December 27, 2025

WGL: పెరిగిన పోక్సో కేసులు

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోక్సో కేసులు పెరిగాయి. అమ్మాయిలపై వేధింపులు గతేడాదితో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగినట్లు పోలీస్ అధికారుల రిపోర్టు స్పష్టం చేస్తున్నాయి. 2024లో 364 కేసులు ఉండగా, 2025లో 405 కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో షీటీమ్స్ కేసుకు 2024లో 243 ఉండగా, 2025 వార్షిక సంవత్సరంలో 209 నమోదయ్యాయని <<18685054>>వార్షిక నివేదిక <<>>సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

News December 27, 2025

MNCL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో తగ్గిన నేరాలు: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే 2025లో ప్రధాన నేరాలు తగ్గాయని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడారు. హత్యలు, దోపిడీలు, గృహాల్లో చోరీలు, అల్లర్లు, అత్యాచారం, మోసం, హత్యాయత్నం, తదితర నేరాలు తగ్గినట్లు పేర్కొన్నారు. నివారణాత్మక పోలీసింగ్, అధిక నిఘా చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయంతో ఇది సాధ్యమైందన్నారు.