News December 26, 2025

బోరాన్ స్ప్రేతో మామిడి పంటకు కలిగే లాభాలు

image

బోరాన్ పిచికారీ వల్ల పూత, పిందె రాలడం, పండ్లు పగలకుండా ఉండటమే కాకుండా.. ఇవి మామిడి పండ్లలో చక్కెర, విటమిన్ సి స్థాయిలను, గుజ్జు శాతాన్ని పెంచుతుంది. బోరాన్‌ను లేత పూత దశలో మరియు పిందెలు వృద్ధి చెందే దశలో పిచికారీ చేసే పురుగు మందులతో కలిపి స్ప్రే చేయవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఇలా చేయడం వల్ల రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెబుతున్నారు. నిపుణుల సూచనలతో అవసరమైన మోతాదులో బోరాన్ పిచికారీ చేయాలి.

Similar News

News December 28, 2025

వెన్నును బలిష్ఠంగా చేసే మేరుదండ ముద్ర

image

మేరుదండ ముద్రను రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపడటంతో పాటు వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముందుగా వజ్రాసనం/ సుఖాసనంలో కూర్చోని చేతులను తొడలపై ఉంచాలి. బొటన వేలును నిటారుగా పెట్టి మిగతా నాలుగువేళ్లను మడిచి ఉంచాలి. దీన్ని రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్ను నొప్పి కూడా తగ్గుతుందంటున్నారు.

News December 28, 2025

వైకుంఠ ద్వార దర్శనంతో ఆరోగ్యం!

image

ఉత్తర ద్వార దర్శనం జ్ఞాన వికాసానికి సూచిక. మన శరీరంలో ఉత్తర భాగంలో ఉండే ‘సహస్రార చక్రం’ ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించడం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి, దైవిక జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకోవడమే. ఆలయానికి వెళ్లలేని వారు ఏకాగ్రతతో మనసులోనే ఆ శ్రీహరిని స్మరించుకున్నా సంపూర్ణ ఫలితం దక్కుతుంది. భక్తితో చేసే ఈ దర్శనం మనకు శాశ్వత శాంతిని, మోక్షాన్ని చేకూరుస్తుంది.

News December 28, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.