News March 11, 2025

బోరుగడ్డకు బెయిల్ ఇవ్వొద్దు: పోలీసులు

image

సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్‌కు బెయిల్ ఇవ్వొద్దని నాలుగో పట్టణ పోలీసులు అనంతపురం ఎక్సైజ్ కోర్టుకు విన్నవించారు. తల్లికి అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్ పొందిన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, తప్పుడు పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై హైకోర్టులో తేలేవరకు విచారణను పెండింగ్‌లో ఉంచుతున్నట్లు న్యాయాధికారి తెలిపారు.

Similar News

News March 11, 2025

కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤కర్నూలు: ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డీబార్➤ ఆదోని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి➤ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ➤ బీటీ నాయుడి ఆస్తులు రూ.5.68కోట్లు ➤ ఆలూరు: వైసీపీ ‘యువత పోరు’ అంటూ కొత్త డ్రామా➤ నటుడు పోసానికి ఆదోని కేసులో బెయిల్ మంజూరు➤ నందవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి➤ వైసీపీపై మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జి మండిపాటు ➤ పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ బస్సు సౌకర్యం

News March 11, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>మార్చి 15న పాడేరులో మెగా జాబ్ మేళా
>వైద్యశాఖలో పోస్టుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం
> నేటి ఇంటర్ పరీక్షలకు 654 మంది దూరం
>రంపచోడవరానికి చెందిన ముగ్గురి అరెస్టు
>రాజవొమ్మంగిలో గిరిజన రైతులకు ఉచితంగా ఎరువులు
>ఏజెన్సీలో గిరిజనేతరులకు గృహాలు మంజూరు చేయాలి..శిరీషదేవి
> డబ్బు తీయాలన్నా..డోలీ ఎక్కాల్సిందే!
>పాడేరులో 7 అంబులెన్సులు ప్రారంభం

News March 11, 2025

పార్వతీపురం స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా నియామకం

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మంగళవారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆంధ్రప్రదేశ్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్‌ను నియమించింది. దీంతో బాటు రాష్ట్రంలో ఉన్న 5జోన్లకు జోనల్ అధికారులను కూడా నియమించింది.

error: Content is protected !!