News October 31, 2024

బోరుగడ్డ అనిల్‌కు 7 రోజుల రిమాండ్

image

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు= శ్రీకాకుళం ఫస్ట్ క్లాస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్ట్ జడ్జీ భరణి 7 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై గతంలో అనిల్ చేసిన విమర్శలపై కేసు నమోదవ్వడంతో పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో భరణి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో ఇప్పటికే అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు.

Similar News

News December 25, 2025

అమరావతి రైల్వే లైన్.. మరో 300 ఎకరాల సేకరణ

image

ఎరుపాలెం-అమరావతి-నంబూరు బ్రాడ్ గేజ్ లైన్ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరుల్లపాడు, కంచికచర్ల మండలాల్లోని 8 గ్రామాల్లో ఈ భూమిని సేకరించనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములు ఉన్నాయి. 56.53 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అమరావతికి రైలు మార్గం కల్పించడంలో కీలకమని అధికారులు అంటున్నారు.

News December 25, 2025

GNT: వాజ్‌పేయి వాణికి.. యజ్ఞనారాయణ అనువాదం!

image

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సందేశాలను తెలుగులో ప్రజలకు చేరవేయడంలో గుంటూరుకి చెందిన జూపూడి యజ్ఞనారాయణ కీలక పాత్ర పోషించారు. జనసంఘ్‌, బీజేపీ నేతగా, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడిగా సేవలందించిన యజ్ఞ నారాయణ, వాజ్‌పేయి హిందీ ప్రసంగాలకు తెలుగు అనువాదకుడిగా ప్రజాదరణ పొందారు. వాజ్‌పేయి హిందీ ప్రసంగాలను ఆసక్తిగా వినే గుంటూరు ప్రజలతో ఆయన అనుబంధానికి యజ్ఞ నారాయణ ప్రధాన వారధిగా నిలిచారు.

News December 24, 2025

తాడేపల్లి: పవన్ రాక.. నాగేశ్వరమ్మ సంతోషానికి హద్దులు లేవు.!

image

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ రాకతో ఇండ్ల నాగేశ్వరమ్మ సంతోషం ఆకాశాన్ని తాకింది. ఇచ్చిన మాట ప్రకారం జనసేన అధినేత వస్తున్నాడని సమాచారంతో బుధవారం ఆమె ఇప్పటం గ్రామంలోని తన ఇంటిని పార్టీ జెండాలతో అలంకరణ చేసి, పుష్పాలతో స్వాగతం పలికారు. బంగారు కొండని సంబోధిస్తూ ఎంతో ఆప్యాయంగా పవన్‌ను ఆహ్వానించారు. పవన్ తన జీతం నుంచి రూ.5వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో ఇస్తానని హామీ ఇవ్వడంతో నాగేశ్వరమ్మ ఎమోషనల్ అయ్యారు.