News March 19, 2025
బ్యాంకర్లతో సమీక్షించిన MHBD జిల్లా కలెక్టర్

మహబూబాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ.. రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 20, 2025
ధవలేశ్వరం: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

రూరల్‌లోని 2019లో ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు, 5 వేల జరిమానా విధించింది. బుధవారం రాజమండ్రి కోర్టులో వాద ప్రతి వాదనలు విన్న తర్వాత జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయి దాడి గణేష్‌కు జీవిత ఖైదు విధించారు. భార్యపై అనుమానంతో దాడిచేసి చంపినట్లు రుజువైందని పీపీ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ధవలేశ్వరం సీఐ గణేష్, హెచ్సీ జయ రామరాజు ముద్దాయిని కోర్టులో హాజరు పరిచారు.
News March 20, 2025
కర్నూలు: ఈవీఎం వేర్ హౌస్‌ను పరిశీలించిన కలెక్టర్

త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలు భద్రపరచిన వేర్ హౌస్‌ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం వేర్ హౌస్‌లో ఈవీఎంలను భద్రపరచిన తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంలను భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News March 20, 2025
సంగారెడ్డి: RYV పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులని చెప్పారు. ఉపాధి పథకం ద్వారా రూ.4 లక్షల వరకు రుణం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 60 నుంచి 80% సబ్సిడీ ఉంటుందని వివరించారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.