News March 29, 2025

బ్యాంకాక్‌లో భూకంపం.. రామగుండం ఎమ్మెల్యే సతీమణి స్పందన

image

ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు పిల్లలతో సహా రామగుండం ఎమ్మెల్యే భార్య మనాలీఠాకూర్ బ్యాంకాక్ వెళ్లారు. వేడుక పూర్తికాగానే ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతుండగా భవనం కంపించడం మొదలై, ప్రకంపనలు భారీగా రావడంతో పిల్లలతో కలిసి ప్రాణాలు దక్కించుకునేందుకు భవనం నుంచి బయటికి వచ్చామని మనాలీఠాకూర్ తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత క్షణాల్లో భవనం కూలిపోయిందని చెప్పారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదని అన్నారు.

Similar News

News December 31, 2025

హైడ్రోసాల్పిన్స్క్‌కి కారణాలు

image

క్లామిడియా, గోనేరియా మొదలైన కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధులు (STDలు) హైడ్రోసాల్పిన్క్స్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. అలాగే క్షయ వ్యాధి, గతంలో ఫెలోపియన్ ట్యూబ్‌ల శస్త్రచికిత్స, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్స తీసుకున్నా ఈ సమస్య రావొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారికి ప్రెగ్నెన్సీ కోసం IVF సిఫార్సు చేస్తారు. హైడ్రోసాల్పిన్క్స్‌ను అల్ట్రాసౌండ్, ఇతర ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించి నిర్ధారణ చేస్తారు.

News December 31, 2025

ఇతిహాసాలు క్విజ్ – 113 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన, బాణం వేసిన బోయవాడు ఎవరు? ఆయన పూర్వజన్మలో ఎవరు?
సమాధానం: త్రేతాయుగంలో రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని చంపాడు కదా! ఆ వాలియే ద్వాపర యుగంలో ‘జరుడు’ అనే బోయవాడిగా జన్మించాడు. రాముడు వాలికి ఇచ్చిన మాట ప్రకారం.. ఈ జన్మలో కృష్ణుడిగా ఉన్న తనను చంపే అవకాశాన్ని వాలికి(జరుడికి) కల్పించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 31, 2025

ATP: లోక్ అదాలత్ ద్వారా 12,326 కేసులు పరిష్కారం

image

అనంతపురం జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది 12,326 కేసులు పరిష్కారమైనట్లు SP జగదీష్ బుధవారం వెల్లడించారు. వివిధ కేసుల్లో 61 మందికి శిక్షలు పడ్డాయన్నారు. నిబంధనల ఉల్లంఘనపై రూ.1.35 లక్షల ఈ-చలానాలు విధించి రూ.3.93 కోట్ల జరిమానా వసూలు చేశారు. డ్రోన్లతో నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. డయల్ 100 ద్వారా కేవలం 12 నిమిషాల్లో స్పందించి బాధితులకు అండగా నిలుస్తున్నట్లు SP వివరించారు.