News January 29, 2025

బ్యాంకులో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేయాలి:ఎస్పీ 

image

భద్రాద్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం సమావేశం అయ్యారు. ఇటీవల వరంగల్, బీదర్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో జరిగిన దొంగతనాలను ఉద్దేశించి జిల్లాలో జరగకుండా బ్యాంక్ అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. బ్యాంక్ లోపల, వెలుపల అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ అలారం ఉండాలన్నారు.

Similar News

News November 4, 2025

APPLY NOW: NRDCలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<>NRDC<<>>)3 అసిస్టెంట్ మేనేజర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ/ఎంటెక్, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://www.nrdcindia.com

News November 4, 2025

ఉప్పలగుప్తం: నాచుతో డబ్బులే డబ్బులు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలను సముద్రపు నాచు పెంపకానికి ఎంపిక చేసినట్లు అమృతానంద విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమృత నటరాజన్ తెలిపారు. నాచును ఆహారంగా తీసుకుంటున్న జపాన్ దేశస్థుల ఆయుష్షు పెరిగినట్టు సర్వేలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఉప్పలగుప్తం(M) వాసాలతిప్పలో సోమవారం మత్స్యకారులకు నాచు పెంపకంపై అవగాహన కల్పించారు. ఎరువులు వాడకుండానే 45 రోజులకు నాచు ఉత్పత్తి వస్తుందని వివరించారు.

News November 4, 2025

రేపు కడపకు రానున్న AR రెహమాన్

image

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.