News January 23, 2025

బ్యాంకుల భద్రత అధికారులు దృష్టి పెట్టాలి: సీపీ

image

వినియోగదారుల సొమ్ము కాపాడేందుకు బ్యాంక్‌ అధికారులు బ్యాంకు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వరంగల్‌ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. వినియోగదారుల సొమ్మును భద్రపరచుకున్న సంబంధిత బ్యాంక్‌ అధికారులు తీసుకోవాల్సిన భద్రత చర్యలపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ట్రై సిటీ పరిధిలో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ పలు సూచనలు చేశారు.

Similar News

News January 7, 2026

ఖమ్మం సీపీఐ సభకు CM రేవంత్

image

సీపీఐ శత వసంతాల ముగింపు వేడుకలకు ఖమ్మం వేదిక కానుంది. ఈనెల 18న స్థానిక ఎస్.ఆర్ & బీ.జీ.ఎన్.ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభకు CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక సభలో సీఎం ప్రసంగించనున్నట్లు సీపీఐ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News January 7, 2026

సంగారెడ్డి: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు.

News January 7, 2026

జనవరి 07: చరిత్రలో ఈరోజు

image

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1938: నటి బి.సరోజాదేవి జననం
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం
* 1967: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జననం (ఫోటోలో)
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2008: జైపూర్ ఫుట్ (కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం