News January 25, 2025

బ్యాంక్ అధికారులతో సమావేశమైన విశాఖ సీపీ

image

విశాఖ నగరంలో బ్యాంక్ అధికారులతో సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం సమావేశం అయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దర్యాప్తు కోసం బ్యాంకులకు పోలీసులు సమాచారం కోరితే నెల రోజులు గడిచినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. సైబర్ క్రైమ్, ఏటీఎంలలో దొంగతనం జరిగినప్పుడు పోలీసులకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు. బ్యాంకులు, పోలీసులు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేయొచన్నారు.

Similar News

News February 16, 2026

సాంయంత్రం 6 దాటాకే ఆర్కే బీచ్‌‌కు అనుమతి..

image

విశాఖ బీచ్ రోడ్డులో ఈనెల 16, 17 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ICP-2026 ప్రాక్టీస్ పరేడ్ జరగనుంది. ఈ సమయంలో సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీకి కేటాయించారు. ఎన్టీఆర్ సర్కిల్, పార్క్ హోటల్ జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు. సందర్శకులు సాయంత్రం 6 గంటల తర్వాతే బీచ్‌కు రావాలని పోలీసులు కోరారు.

News February 15, 2026

మెరుగైన ర్యాంకు కోసం GVMC కసరత్తు

image

స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 సర్వే నేపథ్యంలో నగర ర్యాంకు మెరుగుదలపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే నెల ఢిల్లీ బృందం పరిశీలనకు రానుంది. దీంతో జీవీఎంసీ పర్యవేక్షణను పెంచి సిబ్బంది పనితీరును సమీక్షిస్తోంది. పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవగాహన కార్యక్రమాలతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, మెరుగైన ర్యాంకే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News February 15, 2026

రుషికొండ బీచ్‌లో బీటెక్ విద్యార్థి మృతి

image

రుషికొండ బీచ్‌లో మునిగి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విశాఖలో బీటెక్ చదువుతున్న అరవింద్( 21) తన స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా.. అరవింద్‌తో పాటు రాజీవ్ సముద్రంలో కొట్టుకొనిపోయారు. వెంటనే స్పందించిన లైఫ్ గార్డ్స్ వారిని ఒడ్డుకి తీసుకొచ్చారు. అప్పటికే అరవింద్ చనిపోయాడు. రాజీవ్‌‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.