News January 30, 2026

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>బ్యాంక్<<>> ఆఫ్ బరోడా 23 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, ME/MTech/MCA కంప్యూటర్ సైన్స్/IT/E&C అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, డిప్యూటీ మేనేజర్‌కు 35ఏళ్లు. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: bankofbaroda.bank.in

Similar News

News February 17, 2026

మొదలవని మ్యాచ్.. ఆస్ట్రేలియా పని అయిపోయినట్లేనా?

image

T20 WC2026: ఆస్ట్రేలియా జట్టు సూపర్-8 భవిష్యత్తును నిర్ణయించే మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలె స్టేడియంలో వర్షం పడుతుండటంతో జింబాబ్వే vs ఐర్లాండ్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. వర్షం తగ్గే అవకాశాలు లేవని క్రిక్‌బజ్ తెలిపింది. ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆస్ట్రేలియా ఈ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగి జింబాబ్వే గెలిచినా కంగారూలు ఇంటిదారి పట్టినట్లే.

News February 17, 2026

అంతిమ సంస్కారాల్లో మట్టి కుండను ఎందుకు పగులగొడతారు?

image

హిందూ ధర్మంలో మట్టి కుండను మానవ శరీరానికి, దానిలోని నీటిని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. ప్రదక్షిణ సమయంలో చిల్లుల నుంచి కారే నీరు, శరీరం-ఆత్మ మధ్య బంధం క్రమంగా వీడిపోవడాన్ని సూచిస్తుంది. చివరగా కుండను పగలగొట్టడం అంటే.. ప్రాపంచిక బంధాలన్నీ తెంచుకుని, పంచభూతాలతో నిర్మితమైన శరీరం తిరిగి ప్రకృతిలో కలిసిపోయిందని, ఆత్మ మోక్ష మార్గంలో స్వేచ్ఛగా పయనించాలని అర్థం. ఇది ఆత్మ అంతిమ విముక్తికి ప్రతీక.

News February 17, 2026

BEL 72 పోస్టులకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) నవీ ముంబైలో 72 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech(ECE, M.E), BSc, BCom, BA, డిప్లొమా(ECE, ME, ITI) అర్హతగలవారు NATS/NAPS పోర్టల్‌లో FEB 27 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లకు ఫిబ్రవరి 28న, ఐటీఐ అప్రెంటిస్‌లకు మార్చి 2న ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వెబ్‌సైట్: https://bel-india.in