News March 17, 2026
‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరు మార్పు.. స్పందించిన డైరెక్టర్

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ <<19398040>>పేరును<<>> ‘మాతృభూమి’గా మార్చడం తెలిసిందే. దీనిపై మూవీ డైరెక్టర్ అపూర్వ లాఖియా స్పందించారు. ‘ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ముందుగానే 2 టైటిల్స్ నమోదు చేసుకున్నాం. మానవత్వం, సానుభూతి, మన సైనికుల నిశ్శబ్ద పోరాటాల గురించి మూవీ తెలియజేస్తుంది. కొత్త టైటిల్ చిత్రంలోని భావోద్వేగాన్ని మరింత ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు.
Similar News
News March 30, 2026
హార్ముజ్‌లో ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’

హార్ముజ్ జలసంధి నుంచి భారతీయ నౌకలను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు నేవీ ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ చేపడుతోంది. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు యుద్ధనౌకలను నేవీ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. భారతీయ మర్చంట్ నౌకలు.. ముఖ్యంగా చమురు వంటి కీలక వనరులు ఉన్న షిప్పులను దాటించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ఒమన్ గల్ఫ్ వద్ద ప్రస్తుతం ఇవి ఆపరేట్ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
News March 30, 2026
ఈవీలపై ప్రభుత్వ ఉద్యోగులకు 20% వరకు డిస్కౌంట్!

TG: ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలపై 10-20% రాయితీ ఇచ్చేందుకు సంస్థలు ముందుకొచ్చాయి. టాటాలో కర్వ్ ఈవీ మోడల్స్‌పై ₹3.4L-4L, పంచ్‌లో ₹2.75L-2.80L వరకు తగ్గింపు లభించనుంది. మహీంద్రాలో XUV-400 EL ప్రోపై ₹3.49లక్షల డిస్కౌంట్‌కు సంస్థ అంగీకరించింది. ఇతర ఈవీలపైనా ₹1.20L-2.65L మధ్య తగ్గనున్నాయి. టూవీలర్లలో ఓలా 20%, ఎథర్ 11% డిస్కౌంట్ ఆఫర్ చేశాయి. అయితే నెలకు కొన్ని వాహనాలు మాత్రమే అందిస్తామని తెలిపాయి.
News March 30, 2026
బాహ్యరూపాన్ని బట్టి అంచనా వేయొద్దు!

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడచూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ వాటి రుచులు, గుణాలు వేర్వేరుగా ఉంటాయి. అలాగే మనుషులందరూ పైకి ఒకేలా కనిపించినప్పటికీ ప్రవర్తన, జ్ఞానం, మంచి గుణాల వల్ల గొప్ప వారు ప్రత్యేకంగా ఉంటారు. బాహ్యరూపం చూసి ఎవరినీ అంచనా వేయకూడదని అర్థం.
#PADHYAM


