News April 7, 2024
బ్యాడ్మింటన్ ఆడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పర్యటించిన టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. క్రీడాకారులతో పాటు వాకర్స్ వారిని చప్పట్లతో ప్రోత్సహించారు.
Similar News
News October 3, 2025
గూడూరు బస్టాండ్లో దిన దిన గండం

కీలకమైన గూడూరు బస్టాండ్ ప్రయాణికుల పాలిట దిన దిన గండంగా మారింది. ప్రయాణికులు వేచి చోట ఉండే స్లాబులు పెచ్చులూడుతున్నాయి. కమ్ములు బయటపడి ఎప్పుడు ఏ పెచ్చు ఊడి పైన పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. RTC ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిన పట్టించుకోవడం లేదు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నర్ధకంగా మారింది.
News October 3, 2025
నెల్లూరు: యాక్సిడెంట్ కాదు.. హత్య?

నెల్లూరు జిల్లా గుడ్లూరు(M) రాళ్లపాడు సమీపంలో కారు ఢీకొని ఒకరు <<17897415>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. ఇది పక్కా హత్య అని సమాచారం. దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి(26) మరో ఇద్దరితో కలిసి బైకుపై కందుకూరు నుంచి ఇంటికి బయల్దేరాడు. అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి కారుతో వచ్చి బైకును ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడని సమాచారం. నిందితుతు, మృతుడి మధ్య ఆర్థిక, వివాహేతర విషయమై మధ్య విభేదాలు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
News October 3, 2025
అధికారులకు మాజీ మంత్రి కాకాణి వార్నింగ్

అధికారులు ఎవరైనా TDP నాయకుల మాటలు విని పథకాలు ఆపితే తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ‘నావూరుపల్లికి చెందిన చొప్ప రాజమ్మ పెన్షన్ నిలిపివేతపై హైకోర్టుకు వెళ్లాం. బకాయిలతో సహా పెన్షన్ మొత్తాన్ని ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఇచ్చారు. సర్వేపల్లిలో సర్వం దోపిడిమయం. అభివృద్ధి, సంక్షేమ జాడే కనిపించడం లేదు’ అని ఆయన విమర్శించారు.