News January 4, 2025

బ్యాడ్మింటన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు

image

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన మంత్రి శ్రీధర్ బాబును సచివాలయంలో ఘనంగా సన్మానించారు.

Similar News

News February 16, 2026

కరీంనగర్ మేయర్ పీఠంపై సందిగ్ధత!

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీకి 34 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కూటమికి 35 ఓట్లు ఉన్నట్లు భావించారు. అయితే, అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సహకరించని పక్షంలో మేయర్ పీఠం కమలం వశమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

News February 16, 2026

కరీంనగర్ బల్దియాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

image

కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా సోమవారం మధ్యాహ్నం వరకు పౌర సేవలను నిలిపివేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

News February 15, 2026

KNR: ‘కమిషనరేట్‌’ పరిధిలో ఆంక్షలు.. 144 సెక్షన్‌ అమలు

image

కరీంనగర్ MCK పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.