News January 16, 2026
బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్

TG: గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మామడ మం. పొన్కల్ గ్రామంలోని ఆ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసి యాసంగికి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోని చనాక-కొరాటా పంప్ హౌస్‌ను సీఎం ప్రారంభించారు.
Similar News
News February 21, 2026
ఉగ్రదాడులకు చంచల్‌గూడ జైల్లో పథక రచన

TG: దేశంలో ఉగ్రకుట్ర <<19199047>>వ్యవహారంలో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ పేలుళ్లకు పాల్పడాలని చంచల్‌గూడ జైలులో లష్కరే తోయిబా ఉగ్రవాది పథకం రచించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ములాఖత్‌లో భాగంగా తనను కలవడానికి వచ్చిన వారితో జైల్లోనే ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో నగరంలోని ముసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
News February 21, 2026
T20 WC: భారత్‌కు షాక్!

సూపర్-8లో రేపు సౌతాఫ్రికాతో మ్యాచుకు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. నిన్న నెట్స్‌లో పేస్ బౌలర్ సిరాజ్ గాయపడినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ బ్యాటింగ్ చేస్తూ కొట్టిన బంతి సిరాజ్ మోకాలికి తగలడంతో నొప్పితో మైదానాన్ని వీడినట్లు తెలిపాయి. సిరాజ్ గాయం తీవ్రతపై టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అటు ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్‌లో ఉందంటూ ప్లేయర్ల ఫొటోలను BCCI షేర్ చేసింది.
News February 21, 2026
చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.


