News November 4, 2024
బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో రెండు నెలల పాటు పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతులకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆ సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతులు ఈ నెల 11వ తేదీలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. యువతులకు హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు.
Similar News
News February 27, 2026
జిల్లా ఆసుపత్రిలో పడిపోతున్న రక్త నిలువలు

జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో రక్త నిలువలు అడుగంటిపోతుండటం కలకలం రేపుతోంది. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్యాంకులో ప్రస్తుతం కేవలం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోగుల అవసరాల దృష్ట్యా ఒకరికి రక్తం ఇచ్చేందుకు ఇద్దరు దాతలను కోరుతున్నా.. కొరత తీరడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రోగులకు ప్రాణాపాయం తప్పదని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News February 27, 2026
రేపటి నుంచి ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ

గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్‌పీవీ టీకా పంపిణీ శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 14 ఏళ్లు దాటిన ప్రతి బాలికకు ఈ టీకా వేయనున్నారు. వచ్చే 90రోజుల్లో 15 ఏళ్లు నిండే వారు కూడా ఉచితంగా టీకా పొందేందుకు అర్హులని అధికారులు పేర్కొన్నారు.
News February 27, 2026
సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్.. మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్!

జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో యంత్రాంగం కొరడా ఝుళిపించింది. సుమారు 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని మాయం చేసిన నలుగురు మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. బకాయిల రికవరీకి ‘ఆర్ఆర్ యాక్ట్’ అమలు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తహశీల్దార్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత, నిత్యావసర వస్తువుల చట్టం కింద చర్యలు చేపట్టారు.


