News September 23, 2025
బ్రహ్మచారిణిగా జోగులాంబ అమ్మవారు

అలంపూర్‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు అయిన మంగళవారం, జోగులాంబ అమ్మవారు బ్రహ్మచారిణి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఆలయం 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమం వద్ద ఈ ఆలయం ఉంది.
Similar News
News September 23, 2025
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆరంభం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకలో భాగంగా ఆలయానికి నైరుతి దిశలో ఉన్న పుట్ట మట్టిని సేకరించి, అందులో నవధాన్యాలను నాటుతారు. బుధవారం సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. ఈ ఉత్సవాలపై ఉపగ్రహ నిఘా ఉంటుందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.
News September 23, 2025
తిరుమల బ్రహ్మోత్సవాల్లో 16 రకాల వంటకాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (Sept 24-Oct 2) భక్తులకు 16 రకాల వంటకాలు పంపిణీ చేయనున్నారు. వాహన సేవలు తిలకించేందుకు 36 LED స్క్రీన్‌లు అమర్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలకు 60 టన్నుల పుష్పాలు వినియోగిస్తున్నారు. రోజూ 8L లడ్డూలు అందుబాటులో ఉంటాయి. 229 కళాబృందాల ప్రదర్శనలు ఉంటాయి. భద్రత కోసం 3K సీసీ కెమెరాలు, 7K పైగా సిబ్బందిని నియమించారు.
News September 23, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లేని జూబ్లీహిల్స్!

GHMCలో నియోజకవర్గాలు, డివిజన్ల విభజన కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎన్నికలు వస్తే తప్పా ఇది ఎవరూ గమనించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తోంది. అంతటా ప్రచారం చేస్తోన్న నాయకులు జూబ్లీహిల్స్ డివిజన్‌ను టచ్ చేయడం లేదు. ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండ, షేక్‌పేట, రహమత్‌నగర్, వెంగళరావునగర్, సోమాజిగూడ(PART)లో పర్యటిస్తున్నారు. పేరుకే ‘జూబ్లీహిల్స్’ డివిజన్ అయినా ఇది ఖైరతాబాద్ అసెంబ్లీలో ఉండటం గమనార్హం.