News December 18, 2025
‘బ్రహ్మపుత్ర’పై చైనా డ్యామ్.. భారత్‌కు ముప్పు!

యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై $168B (సుమారు రూ.1,51,860CR)తో చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నది కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది. సుమారు 2KM ఎత్తును ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల నది సహజ ప్రవాహం మారే ప్రమాదం ఉంది. దీంతో వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశముంది. అలాగే భవిష్యత్తులో నీటిని ఆయుధంగానూ ఉపయోగించే ప్రమాదముంది.
Similar News
News December 18, 2025
భారీ జీతంతో NCRTCలో ఉద్యోగాలు

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(NCRTC) 5 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టును బట్టి BE, B.Tech, PG, మేనేజ్‌మెంట్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. Dy.GMకు పేస్కేల్ రూ.70వేలు-రూ.2లక్షలు, Asst.మేనేజర్‌కు రూ.50,000 -రూ.1,60,000 ఉంది. వెబ్‌సైట్: www.ncrtc.co.in
News December 18, 2025
బీర సాగులో మంచి ఆదాయానికి సూచనలు

బీరపంట సాధారణంగా విత్తిన 45 రోజులకు కోతకు వస్తుంది. బీరను నేల మీద కాకుండా పందిరి, స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తే ఎక్కువ రోజుల పాటు అధిక దిగుబడి వస్తుంది. చీడపీడలు తగ్గి, కాయ నాణ్యత బాగుంటుంది. కోతకు వచ్చిన కాయలను రోజు తప్పించి రోజు కట్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలి. ఆలస్యం చేస్తే కాయ లావుగా మారి ధర తగ్గే ఛాన్సుంది. ఉదయమే తెంపి మార్కెట్‌కు తీసుకెళ్తే అవి మరింత తాజాగా కనిపించి ఎక్కువ ధర వస్తుంది.
News December 18, 2025
హీరోయిన్‌కు చేదు అనుభవం.. కేసు నమోదు

నిన్న హైదరాబాద్‌లోని KPHB లులూ మాల్‌లో ‘రాజా సాబ్’ సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు <<18602526>>అనుభవం<<>> ఎదురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అభిమానుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నిర్వహణ లోపంపై మాల్, ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అభిమానులు సెల్ఫీలకు పోటెత్తడంతో నిధి అసౌకర్యానికి గురయ్యారు.


