News February 26, 2026

బ్రహ్మాస్త్రం తయారీ.. ఎలా ఉపయోగించాలి?

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

Similar News

News February 26, 2026

పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక

image

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌(రాజస్థాన్)లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:10 గంటలకు విజయ్.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ సందర్భంగా అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ‘VIJAY DEVARAKONDA’ హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండ్ అవుతోంది. సాయంత్రం మరోసారి ‘<<19227454>>కొడువ<<>>’ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.

News February 26, 2026

127KGల గోల్డ్ స్కామ్.. నటి రన్యారావుకు షాక్

image

బంగారం స్మగ్లింగ్ కేసులో దాదాపు ఏడాదిగా జైలులో ఉన్న కన్నడ నటి <<15969980>>రన్యారావుకు<<>> మరో షాక్ తగిలింది. తాజాగా ED బెంగళూరులోని PMLA కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును ప్రస్తావించింది. రూ.102 కోట్ల విలువైన 127 కేజీల బంగారాన్ని రన్యారావు సిండికేట్ ముఠా దుబాయ్ నుంచి INDకు అక్రమంగా తరలించినట్లు తెలిపింది. కాగా గతేడాది మార్చి 3న 14.2 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ నటి దొరికిపోయిన విషయం తెలిసిందే.

News February 26, 2026

తిరుమలలో నేటి నుంచి తెప్పోత్సవాలు

image

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతాయి. మార్చి 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారు దర్శనమిస్తారు. మొదటి రోజు శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు శ్రీకృష్ణస్వామి, చివరి 3 రోజులు మలయప్పస్వామి వారు తెప్పలపై విహరిస్తారు. ఈ వేడుకల కారణంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు కొన్ని ప్రత్యేక సేవలను TTD రద్దు చేసింది.