News September 12, 2025

బ్రహ్మోత్సవాలకు సమష్టిగా పనిచేయాలి: TTD ఈవో

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలను కన్నులపండువగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా పని చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 నుంచి జరగునున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై గురువారం అన్నమయ్య భవన్‌లో శాఖల వారీగా ఆయన సమీక్షించారు. పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కోరారు.

Similar News

News September 12, 2025

ADB: కూలిన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం సాయంత్రం కూలిన పురాతన భవనాన్ని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. తహసిల్దార్ శ్రీనివాస్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని వారు తెలిపారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని వారు చెప్పారు.

News September 12, 2025

లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్.. త్వరలో కొత్త రూల్?

image

లోన్‌పై కొనుగోలు చేసిన ఫోన్ల విషయంలో RBI కొత్త రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సకాలంలో లోన్ చెల్లించకపోతే ఫోన్లను రిమోట్‌ విధానంలో లాక్ చేసేలా రుణదాతలకు RBI అనుమతి ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ‘దీనికి యూజర్ల ముందస్తు అనుమతి, డేటా ప్రొటెక్షన్‌ను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను రూపొందించనుంది. ఫోన్ లాక్ అయ్యేందుకు అందులో ముందే ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు’ అని పేర్కొంది.

News September 12, 2025

భారత్‌తో మ్యాచ్.. పాక్ కోచ్ ఏమన్నారంటే?

image

ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 14న జరిగే IND, PAK మ్యాచులో రిస్ట్ స్పిన్నర్ల మధ్యే పోటీ ఉంటుందన్న అభిప్రాయాలపై PAK కోచ్ మైక్ హెసన్ స్పందించారు. ‘దుబాయ్ పిచ్ స్పిన్‌కు అంతగా సహకరిస్తుందని అనిపించడం లేదు. UAEతో మ్యాచులో కుల్దీప్ యాదవ్ బాల్‌ను ఎక్కువగా స్పిన్ చేయలేదు. రిస్ట్ స్పిన్నర్లుంటే సర్ఫేస్‌తో పనిలేదు. మా జట్టులోనూ ఐదుగురు స్పిన్నర్లున్నారు. నవాజ్ వరల్డ్‌లోనే బెస్ట్ స్పిన్నర్’ అని పేర్కొన్నారు.