News October 10, 2025
బ్రహ్మోత్సవాల పనితీరుపై సమావేశం

9 రోజుల పాటు వైభవంగా సాగిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల పనితీరుపై తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. TTD, పోలీసులలోని వివిధ విభాగల పనితీరు, ఎదుర్కొన్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయడానికి అవకాశం కలుగుతుందని SP సుబ్బారాయుడు, TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సూచించారు. JEO వీరబ్రహ్మం, డీఎఫ్వో ఫణి కుమార్ పాల్గొన్నారు.
Similar News
News October 10, 2025
HYD: ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో న్యూ టెక్నాలజీ.!

HYD మాదాపూర్, RR జిల్లా హెడ్ క్వార్టర్ ఫైర్ స్టేషన్లను IPS విక్రమ్ సింగ్ తనిఖీలు చేశారు. మంటలు అర్పటం కోసం రోబో జెట్లను సైతం వాడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో న్యూ టెక్నాలజీ మిళితమైందని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. 10ఫ్లోర్ల పైకి తీసుకెళ్లే 54 మీటర్ల బ్రౌన్టో స్కై లిఫ్ట్ అందుబాటులో ఉందన్నారు.
News October 10, 2025
మంచిర్యాలలో ఈ నెల 13న ప్రజావాణి

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణిని ఈ నెల 13 నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో ప్రజావాణి యథావిధిగా ఉంటుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 10, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

AP: ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్రవారం అత్యధికంగా కోనసీమ(D) నగరంలో 46MM, మలికిపురంలో 36.2MM వర్షపాతం నమోదైందని తెలిపింది.