News September 21, 2025
బ్రహ్మోత్సవాల సమయంలో వివాదాలు అవసరమా..?

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తిరుమల వైపు చూస్తారు. టీటీడీ టార్గెట్‌గా సాగుతున్న వివాదం కారణంగా భక్తులు బ్రహ్మోత్సవాల హడావిడిపై కాకుండా వివాదంపై దృష్టి మళ్లుతుంది. తిరుమల పవిత్రత దృష్ట్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగేలా దృష్టి సారించాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
Similar News
News September 22, 2025
HYD: కోహెడ జలపాతంలో పడిపోయిన ఇంటర్ విద్యార్థి

HYD అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధి కోహెడ జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. బేగంపేట రసూల్‌పూర్‌కు చెందిన క్యామా సాయితేజ(17), అతడి ఏడుగురు స్నేహితులు సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్ కలిసి సా.4 గంటల ప్రాంతంలో ORR సర్వీస్ రోడ్డు పక్కనున్న కోహెడ జలపాతం వద్దకెళ్లారు. ఫొటోలు తీస్తుండగా సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, DRF బృందం వెతుకుతున్నారు.

విశాఖలో 2,476 ఆక్రమణలు తొలగింపు

ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా ఆదివారం ఒక్కరోజే 717 ఆక్రమణలు తొలగించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకరరావు తెలిపారు. నాలుగు రోజుల్లో మొత్తం 2,476 ఆక్రమణలు తొలగించినట్లు వెల్లడించారు. ప్రధానంగా తగరపువలస, మిథిలాపురి, కొమ్మాది, పెదగదిలి, ఆర్‌టీసీ కాంప్లెక్స్, జగదాంబ, దొండపర్తి, గాజువాక, వడ్లపూడి, నెహ్రూ చౌక్, ప్రహలాదపురం తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఆక్రమణలు తొలగించినట్లు పేర్కొన్నారు.