News February 25, 2026
బ్రాహ్మణపల్లిలో షీ టీం అవగాహన సదస్సు

రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జి ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వార్డ్ మెంబర్ల శిక్షణలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ మోసాలు, యాంటీ డ్రగ్స్ అంశాలపై వివరించారు. వేధింపులపై 6303923700కు, సైబర్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News February 26, 2026
TTD పేరుతో నకిలీ వెబ్‌సైట్లు.. జాగ్రత్త

AP: శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై TTD విజిలెన్స్ అప్రమత్తమైంది. తిరుమల చిత్రాలు, TTD పేరును ఉపయోగించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఫేక్ వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేసింది. https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే సేవలు పొందాలని సూచించింది.
News February 26, 2026
తిరుమల ఘాట్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు బైకుపై కొండ దిగడానికి ప్రయత్నించారు. 30వ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. నటరాజన్ అనే వ్యక్తి చనిపోగా.. మురళీ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం స్విమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 26, 2026
ఖమ్మం: ఉపసర్పంచ్ పదవికి సర్పంచ్ భార్య రాజీనామా

తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెం ఉపసర్పంచ్ కుంభం యమున తన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భర్త ఉపేందర్ సర్పంచ్‌గా, భార్య యమున ఉపసర్పంచ్‌గా ఎన్నికై భార్యాభర్తలు గ్రామాన్ని ఏలుతూ వార్తల్లో నిలిచారు. అయితే వ్యక్తిగత కారణాలతో బుధవారం ఎంపీడీవో సిలార్ సాహెబ్‌కు ఆమె రాజీనామా పత్రాన్ని అందజేశారు. కేవలం మూడు నెలలకే రాజీనామా చేయడం మండలంలో చర్చనీయాంశమైంది.


